పుట:KutunbaniyantranaPaddathulu.djvu/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


25.గర్భస్రావ చట్టము

భారత ప్రభుత్వము గర్భస్రావ చట్టాన్ని 1-4-1972 నుంచి అమలులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ చట్టంలోని విషయాలు తెలియక యెందరో గర్భస్రావము చేయించుకోవడము చట్టప్రకారం నేరం కాదని భావిస్తారు. కాని వాస్తవానికి పూర్వం చట్టంలో కంటే ఇప్పటి కొత్త చట్టంలో అబార్షన్ చేయించుకోవడానికి కొన్ని అవకాశాలే విస్తృత పరచటము జరిగింది. పూర్వపు చట్టములో ఒకే ఒక ప్రాతిపదికమీద అబార్షన్ చేయడానికి అవకాశముంటే ఇప్పటి క్రొత్త చట్టం (M.T.P.Act.) ప్రకారం మూడు ప్రాతిపదికలలో ఏదో ఒక దానిమీద అబార్షన్ చేయడానికి అవకాశాన్ని విస్తృతపరచటం జరిగింది. ఎవరై నాసరే కడుపు వద్దనుకుని అబార్భన్ చేయించుకోవాలంటె చట్ట ప్రకారం ఎట్టి అభ్యంతరము లేని విధంగా చట్టము రూపొందించడం జరగలేదు. ఎందుకంటే పుట్టిన ప్రతివ్యక్తికీ జీవించటానికి చట్టప్రకారము ఎలా అర్హత, రక్షణఉందో, అలాగే ఒకసారి గర్భంలో పిండము జీవిగా మారున్నప్పుడు దానికీ చట్టప్రకారము పెరగడానికి, పుట్టడానికి అధికారం వుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో తల్లి