పుట:KutunbaniyantranaPaddathulu.djvu/203

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 203

వాళ్ళకి ధనుర్వాతం రావడము పరిపాటి. గర్భచిచ్ఛేదానానికి అవలంబించిన పద్దతులవల్ల గర్భస్రావము జరిగినా, పూర్తిగా పిండము బయటపడకుండా వుండి, రక్తస్రావము అధికంగా అవుతుంది. అధిక రక్తస్రావంవల్ల షాక్ వచ్చి ప్రాణాపాయము కలుగుతుంది.

గర్భస్రావము అవడానికి వాడిన మందులవల్ల వెంటనే ప్రమాదకర లక్షణాలు కనబడకపోయినా నెమ్మది నెమ్మదిగా ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీనికి గుర్తుగా ఆకలి, అరుగుదల సరిగ్గా వుండకపోవడము, నరాల బలహీనత, గుండె బలహీనత మొదలైనవి కలుగుతాయి. దీనివల్ల అనారోగ్యంగా వుండి, చివరికి ఆరోగ్యము క్షీణించి పోతుంది. మందులేకాదు, అక్రమ పద్దతులద్వారా గర్భస్రావము ప్రయత్నించినప్పుడు కూడా తత్కాలికముగా ఒక్కొక్కసారి ఏమీ నష్టం కనపడకపోయినా తరువాత నిదానముగా దానికి సంబందించిన చెడు ఫలితాలు కనపడతాయి.

గర్భవిచ్చిత్తి - ఇంగువ

పచ్చిబొప్పాయిగాని, ఇంగువగాని ప్రతి కేసులో గర్భస్రావముకలిగించవు. అయితే అరుదుగా కొందరిలో వీటివల్ల గర్భము పోవడము జరుగుతుంది. చాలాకేసుల్లో గర్భము పోవడానికి ఇంగువ లాంటివి వేసుకోవడము వల్ల గర్భము పోకపోవడము అటుంచి కడుపులో మంట, నొప్పి