Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 200

అవుతుంది. ఎర్గాట్, క్వినైన్, ప్రత్తిచెట్టు వేరు రసం, పిట్యూటరీ ఇంజక్షన్ కూడా గర్భస్రావము జరగడానికి ఉపయోగిస్తారు. ఇవేవి కూడా పని చేయవు. ఎర్గట్ గాని, పిట్యూటరీగాని కాన్పునొప్పులు వస్తున్నప్పుడు యింకా ఆ నొప్పులను యెక్కువ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాయి. కాని ఆరోగ్యకరముగా వున్న స్త్రీ గర్భముపైన యెట్టి ప్రభావాన్ని కలిగించలెవు. ఇలా కొంతమంది గర్భస్రావము జరగడానికి పచ్చి బొప్పాయి విత్తనాలు, పచ్చి ఆనపకాయ, జిల్లేడుపాలు, కాకర రసము, ఇంగువ రసము, లవంగ రసము మొదలైనవి ఉపయోగిస్తారు.

పెన్సిళ్ళు, జడపిన్నులు !

కడుపు పోగొట్టుకోవడానికి నాటు మంత్రసానులు, ఆయాలులాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయిదారు అంగుళాల పొడవుగల కర్రపుల్లని గర్భకంఠము ద్వారా గర్భకోశములోకి దూరపడము సాధారణముగా చేసేపని. ఈ పుల్లకి ఒక చివర దూదిచుట్టి ఆ దూదిని నల్లజీడిలోగాని, జిల్లేడు పాలలోగాని ముంచి గర్భకోశములోకి నెట్టుతారు. మర్రిపాలు, గన్నేరుపాలు కూడా ఇందుకు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో ఆర్సనియన్ ఆక్సయిడ్, ఆర్సనిక్ సల్పయిడ్, రెడ్ లెడ్ ఈ దూదికి అంటించి గర్భకోశంలోకి పంపిస్తారు. ఇలా చేస్తే గర్భకోశములో మంట పుట్టి