పుట:KutunbaniyantranaPaddathulu.djvu/199

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 199

వుంటాము. కడుపు పోగొట్టుకోవడానికి ఎవ్వరంతటికి వాళ్ళు మందుబిళ్ళ వేసుకోవడమో, ఫలితము కనబడకపోతే నాటు మంత్రసానులు, దాయాలు దగ్గర్కి వెళ్ళటమో ఛేస్తూ వుటారు. వీళ్ళు కూడా కడుపు పోగొట్టడానికి ఇచ్చే మందులు ఆరోగ్యానికి యెంతో హానికరముగా వుంటాయి. కడుపు పోగొట్టడానికి ఇతరత్రా వీళ్ళు చేసే పనులు యెంతో మోటుగాను, ప్రాణహాని కలిగించేవిగాను వుంటాయి. వితంతువులు, పెళ్ళికాని స్త్రీలు గర్భము వచ్చినప్పుడు వివశులై దిక్కు తోచక యిటువంటి వాళ్ళ చేతులలో పడి ప్రాణము మీదికి తెచ్చుకుంటారు.

కొంతమంది స్త్రీలు గర్భం వచ్చినప్పుడు ఏమయినా బిళ్ళలు వేసుకుంటే గర్భస్రావము జరిగిపోతుందని భావిస్తారు. కాని అది తప్పు అభిప్రాయము. తల్లి ఆరోగ్యానికి ఎట్టి హానీ కలిగించకుండా గర్భము పోయే మందులు లేవు. పెన్నీ రాయిల్, జూనిఫర్, టార్సన్ టాయిన్, ఎస్పియాల్, శానిన్ ఆయిల్ మొదలయిన మందులు గర్భస్రావము జరగడానికి వాడుతూ వుంటారు. సీసముని గర్బస్రావము అవడానికి ఎక్కువగా వాడుతూ వుంటారు. ఈ మందులవల్ల ముందు తల్లి ఆరోగ్యము దెబ్బతింటుంది. చాలా విషమ పరిణామాలు కూడా సంభవిస్తాయి. గర్భము పోవడానికి విపరీత ముగా విరోచనాలు అయ్యె మందు వేసుకుంటారు. దీనివల్ల గర్బము పోవడము ఎలవున్నా ముందు తల్లి పరిస్థితి గల్లంతు