పుట:KutunbaniyantranaPaddathulu.djvu/201

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 201

దానివల్ల గర్భస్రావము జరుగుతుంది. అయితే ఈ పద్దతులు చాలా ప్రమాదకరమైనవి. గర్భస్రావము అవడము ఎలా వున్నా ప్రాణము పోయేటంత పని అవుతుంది. కొంతమంది గర్భాశయంలో వున్న పిండాన్ని పాడుచేయడానికని గర్భాశయము లోపలికి తమకి అందుబాటులో వుండే పెన్సిళ్ళు, బ్నలపాలు, కుట్టుకునే సూదులు, దబ్బలాలు, జడపిన్నులు మొదలైనవి దూరుపుతారు. ఒక్కొక్కసారి ఇవి బయటకు రాకుండా లోపలే యిరుక్కుపోయి వుండిపోతాయి. కొందరు జిల్లెడు పుల్లలు, మర్రిచెట్టు పుల్లలు గర్భాశయ కంఠములో దూర్చి వుంచేస్తారు. మరికొందరు గర్భాశయ కంఠము దగ్గర జీడిసొన, జిల్లేడుపాలు, మర్రిపాలు బాగా రుద్ది వదిలిపెడ్తారు. ఇలా చేయడంవల్ల యోని మార్గము, గర్భాశయ కంఠము, గర్భాశయము మండిపోయి వాచిపోతాయి. పుల్లలు, సువ్వలు లోపలికల్ల దూరపబట్టి గర్భాశయకంఠము చీరుకుపోవడము, గర్భాశయానికి కన్నము పడటము అందులో నుంచి జీర్ణకోశం పేగులు యోని ద్వారమునుండి యబటకు రావడము కూడా జరుగుతుంది.

కొంతమంది నాటు మంత్రసానులు రబ్బరు ట్యూబు ఒకటి తీసుకొని, సిరంజిద్వారా గర్భాశయంలోకి సబ్బునీళ్ళు, పొటాషియం పెర్మాంగనేటు నీళ్ళు, లైసాల్ లాంటివి ఎక్కీస్తారు. ఇలా చేయడంవల్ల చాలా విపరీత పరిణామాలు