పుట:KutunbaniyantranaPaddathulu.djvu/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 196

కాని 50 సి.సి. నుండి 100 సి.సి. వరకు ఎక్కించడం జరుగుతుంది. ఇలా ఎక్కించిన కొద్ది పూటల్లో కాన్పు నొప్పులు వచ్చి పిండము బయట పడిపోతుంది. ఈపద్ధతిని చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదము కలుగుతుంది.

మూడు నెలలకంటే ఎక్కువ గర్భము ఉన్నప్పుడు కొందరికి కడుపుకోసి సిజేరియన్ లాగా పిండాన్ని తీసివేయడము జరుగుతింది. దీనిని హిస్ట్రాటమీ అంటారు.

యం, టి.పి. ఎక్కువసార్లు చేయించుకోవడము మంచిది కాదు. మాటి మాటికీ చేయించుకుంటే దుష్పలితాలు కలిగే అవకాశము ఉంది.

* * *