పుట:KutunbaniyantranaPaddathulu.djvu/195

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 195

క్లీన్ చేసి గర్భాన్ని తొలగించడము జరుగుతుంది. ఈ మొత్తం కొద్ది నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఈ పద్దతి అతి తేలిక, క్షేమకరం అయితే ఇది ఎంత తేలికో, శిక్షణ లేనివాళ్ళు చేస్తే అంత ప్రమాదము జరిగే అవకాశం కూడా ఉంది.

రెండవ పద్ధతి - సక్షను పద్ధతి

ఇందులో గర్భాశయములోనే సన్నటి గొట్టమువంటిది దూర్చి, దానికి ఒక ట్యూబు తగిలించి సక్షనుద్వారా గర్భాశయములో ఉన్న పిండము తాలూకు భాగాలను పీల్చివేసి గర్భాశయాన్ని క్లీన్ చేయడము జరుగుతుంది. ఇది క్యూర్ టాజ్ కంటే తేలికైనది త్వరగా అయిపోతుంది. అయితే కొందరిలో సక్షను చేసినాన్ పూర్తిగా క్లీన్ కాక, క్యూరట్ చేయవలసి వస్తుంది.

మూడవ పద్ధతి- ఇంట్రా ఆమ్ని యాటిక్ ఇంజక్షను పద్ధతి:-

కొందరికి నాలుగు అయిదు నెలలు నిండిన తరువాత అబార్షను చేయించుకోవలసి వస్తుంది. నెలలు ఎక్కువైన అటువంటి స్త్రీలలో పొత్తికడుపు పైనుంఛి పొడుగాటి సూది గర్భాశయములోని ఉమ్మనీరు సంచిలోకి పోనిచ్చి అందులోని ఉమ్మనీరుని సిరంజి ద్వారా బయటికి లాగివేయడము జరుగుతుంది. ఉమ్మనీరు (అమ్ని యాటిక్ ఫ్లూయిడ్) వచ్చి నంత తీసివేసి అందులోకి సలైనుగాని, 50 శాతం గ్లూకోజ్