పుట:KutunbaniyantranaPaddathulu.djvu/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


24. గర్భస్రావానికి నాటు పద్ధతులు

ఎండాకాలము మిట్టమధ్యాహ్నము ఆసుపత్రి నుంచి పిలుపు వస్తే డాక్టర్ ఆనంద్ తన నర్సింగ్ హోమ్‌కి కేసు చూడడానికి వెళ్ళాడు. డాక్టర్ ఆనంద్ యింకా ఆసుపత్రి లోపలికి వెళ్ళకుండానే ఒక యువతి పెట్టే పెద్ద అరుపులు, బాధకి ఓర్వలేక ఏడిచే ఏడుపు వినబడుతోంది. లోపలికి వెళ్ళి చూస్తే 16 సంవత్సరాలయినా నిండని ఒక అమ్మాయి భాధతో మెలికలు తిరిగిపోతూ, చేతితో పొట్ట నొక్కిపట్టుకుని అరుస్తూ కనబడింది. ఆ అమ్మాయిని పరీక్ష చేసిచూస్తే నాలుగు నెలల కడుపు జ్వరం 106 డిగ్రీలు దాకా వుంది. జ్వరంతొ ఒళ్ళు మాడిపోతోంది. కడుపు ముటుకుంటేనే నొప్పి. ఇక ఆమె జననేంద్రియాల విషయం చెప్పనే అవసరంలేదు. ఆమె జననేంద్రియాలు ఎర్రగా వాచిపోయి ముట్టుకుంటేనే ప్రాణం పోయేటంత బాధాకరంగావున్నాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషమ పరిస్థితికి సెక్సు గురించి ఆమెలో వున్న ఆరాటము, అజ్ఞానము కారణము. పదవ తరగతి చదువుతున్న ఈ అరుణకుమారికి ఇప్పుడిప్పుడే సెక్సు గురించి ఆలోచనలు, ఉత్సుకత మొదలెట్టాయి. లేత వయస్సులో వున్న తనకు యీ యవ్వన తొలిదినాల్లో ఒక