పుట:KutunbaniyantranaPaddathulu.djvu/192

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 192

సమయానికి అండానికి కాస్త శిశుపోలికలు ప్రారంభము అవుతాయి. పిండానికి అక్కడక్కడ కొన్ని నల్లటి మచ్చలు కనబడతాయి. ఈ నల్లటి మచ్చలే తరువాత కళ్ళు, ముక్కు, నోరుగా మారుతాయి. దాదాపు ఇదే సమయానికి వెన్నుపూసకి సంబంధించిన సూచనలు కనబడతాయి. నెలా పది హేను రోజుల పిండానికి కాళ్ళు, చేతులు ఇతర అంగాలు ఒక మాదిరిగా ఏర్పడతాయి ఇదే సమయములో సెక్స్ తేడాలు కూడా ఏర్పడే సూచనలు వుంటాయి. ఒకవేళ శాస్త్రజ్ఞులు పిండము యొక్క సెక్సునే తారుమారు చేసే స్థితికి రాగలిగితే ఈ దశలోనే ప్రయత్నం జరిగితీరాలి. లేక పోతే నెలా పదిహేను రోజులు దాటిన తరువాత పూర్తిగా సెక్సు భేదాలు ఏర్పడిపోతాయి. పిండానికి రెండునెలలు నిండేసరికి శరీరంలోని అన్ని అంగాలు తయారవుతాయి. కళ్ళరెప్పలు, చిన్న ముక్కు, చేతివ్రేళ్ళు, కాలివ్రేళ్ళు, గుర్తించే స్థితిలో వుంటాయి. పిండము మూడవనెల నిండే సరికి పిండము మూడు అంగుళాల పొడవు వుంటుంది.

నాలుగవ నెల నిండేసరికి గర్భములోని శిశువు కాళ్ళతో తన్నుతున్నట్లుగా తల్లి గుర్తించడం జరుగుతుంది. అయిదవనెల నిండేసరికి గర్భములోని శిశువు బరువు 6 నుంచి 8 ఔన్సులు వుంటుంది. పొడవు 7 నుంచి 8 అంగుళాలు వుంటుంది. చేతిగోళ్ళు పెరగడము ప్రారంభిస్తుంది. ఇక్కడ నుంచి గర్భము శిశువు చాలా వేగముగా పెరగడం ప్రారంభి