Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 191

పెళ్ళి అయి ఎంతకాలము అయినా గర్భము రాలెదంటే స్త్రీ పురుషులలో ఏదో ఒక లోపము వుండి వుంటుంది. అటువంటప్పుడు ముందు పురుషుని వీర్యం పరీక్ష చేయాలి. ఇటివంటి సందర్భాలలో చాలామంది పురుషులలో వీర్యకణాలు లేకపోవడము జరుగుతుంది. లేదా చాలా తక్కువ సంఖ్యలో వీర్యకణాలు ఉండటం జరుగుతుంది. ఇక స్త్రీల విషయము తీసుకుంటే సాధారణంగా అండము ప్రయాణించే ట్యూబులు మూసుకొనిపోయి ఉండడమో, గర్భాశయము చిన్నదిగా వుండడమో జరుగుతుంది. కొందరు స్త్రీలలో అసలు అండము నెలనెలా సక్రమముగా విడుదల అవుతూ వుండదు. ఇవికాక మరెన్నో కారణాలు గర్భం రాకపోవడానికి ఉన్నాయి. అందుకని గర్భం దాల్చని దంపతులు డాక్టరుచేత అన్ని పరీక్షలు చేయించుకొని దానికి తగిన విధముగా చికిత్స పొందాలి.

పిండం పెరుగుదల

వీర్యకణముతో కలయిక పొందే సమయానికి అండము సైజు అంగుళములో ఇరవైయవవంతుమాత్రమే వుంటుంది. కాని ఒక అండము పిండముగా మారిన 14 రోజులకే దీనికి పదిరెట్లు సైజు పెరిగిపోతుంది. నెలా పది రోజులకి అండము పొడుగు దాదాపు ఒక అంగుళము వుంటుంది. పైగా ఈ