కుటుంబ నియంత్రణ - పద్ధతులు 173
నటలు వుతుంది. నాలిక, పెదవులుపగిలినట్లయి ఎండిపోతాయి. కళ్ళు పసుపుపచ్చగా కామెర్ల లాగా మారిపోతాయి. మూత్రం చాలా కొద్దిగానే అవుతుంది. రక్తపోటు పడిపోతుంది. ఒంట్లో వేడికూడా తగ్గిపోతుంది. ఇటువంటి వేవిళ్ళ పరిస్థితిని చలావరకు సరిదిద్దడమో, అరికట్టడమో జరుగుతున్నది.
వివాహిత స్తీకి వికారం - వాంతులు వచ్చినంత మాత్రాన గర్భం కాదు సుమా!
కొన్ని ఇతర కారణాలవల్ల కూడా కడుపులో వికారంగా వుండడం, వాంతులు అవడం, జ్వరం వున్నట్లు అనిపిస్తుంది. అంతమాత్రాన అవి వేవిళ్ళు లక్షణాలేనని డాక్టరు చేత పరీక్ష చేయించుకోకుండా ఊరుకోవడం సరియైన పద్ధతి కాదు. మూత్రపిండాలకి సంబందించిన వ్యాధి స్రీలల్లో సాధారణంగా కనబడుతుంది. దీనివల్ల వాంతులు అవుతూ వుండడం, ఆకలి లేకపోవడం, ఎప్పుడూ వికారంగా వుండడం ఉంటాయి. అలాగే స్త్రీకి గర్భం రావడంతో సంబంధం లేకుండా జీర్ణకోశవ్యాధులు, లివర్ వ్యాధులు, మెదడుకి సంబంధించిన వ్యాధులు కల్గిన వాంతులు అవుతూ ఉండవచ్చు. అందుచేత డాక్టరుచేత పరీక్షచేయించుకుని వాంతులు వికారం ఎందుకు ఉన్నదీ నిర్ధారణ చేసుకుని చికిత్స పొందాలి.