పుట:KutunbaniyantranaPaddathulu.djvu/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 172

అయితే కొందరిలో ఈ రసాయనిక మార్పులవల్ల వచ్చే శారీరిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి. ఈ మానసిక ఆందోళనవల్ల, భయంవల్ల వేవిళ్ళు తగ్గకపోవడం అటుంచి పెరిగిపోతాయి.

స్త్రీ గర్భవతి అయినప్పుడు హార్మోన్లలో కొంత అస్తవ్యస్తత ఏర్పడుతుంది. ప్రొజస్టిరోన్ హార్మోను తక్కువ అయిపోయి కోరియానిక్ గొనాడో ట్రాపిక్ హార్మోను ఎక్కువ అవడం వేవిళ్ళకి ఒక కారణంగాకూడా భావించబడుతుంది. కొందరిలో కడుపు వచ్చినప్పుడు కొన్ని ఎలర్జీ పరిస్థితులు ఏర్పడి దానివల్ల వాంతులు కలుగుతాయనే భావం ఉంది. ఏది ఏమైనా వేవిళ్ళు ఉన్నప్పుడు పుల్ల పుల్లగా తినడమనేది, కేవలం తినాలని తినడం తప్ప వేరే కారణం లేదని కొందరంటారు.

అతిగా వేవిళ్లు

ముందు చెప్పిన కారణాలతో పాటు గర్భవతి అయిన స్రీలల్లో మానసిక భయాందోళనలు ఎక్కువగా ఉంటే వేవిళ్ళు అతిగా ఉంటాయి. ఇలా అతిగా వేవిళ్ళు ఉన్న స్త్రీ పూర్తిగా క్షీణించిపోవడం జరుగుతుంది. వాంతులు నీళ్ళు నీళ్ళుగా ఉండడమో, కాఫీ రంగులో ఉండడమో జరుగుతుంది. అతిగా వాంతులు అవడంవల్ల కళ్లు లోపలికి పోతాయి. చర్మానికి సాగే గుణం పొతుంది. కడుపులోపల అణిగిపోయి