పుట:KutunbaniyantranaPaddathulu.djvu/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 171

గ్యానికి ఎటువంటి హాని కలగదు. ఇటువంటి స్త్రీలకి వేవిళ్ళు వున్నా తీసుకున్న ఆహారం అంతగా బయటకుపోదు. అందువల్ల వీరు బరువు కోల్పోవడం జరగదు. కాని అరుదుగా కొందరిలో ఈ వేవిళ్ళు చాలా ఎక్కువగా వుంటాయి. తక్కిన స్త్రీలలో కొద్దిరోజులుండి తగ్గిపోతే, ఈ స్త్రీలల్లో వచ్చిన వేవిళ్ళు తగ్గకపోవడం అటుంచి, ఇంకాఎక్కువ అవుతాయి. తీసుకున్న ఆహారం ఏ మాత్రం వంటబట్టకుండా వాంతులు పోవడం, దానివల్ల బాగా నీరసం వచ్చేయడం, బరువు తగ్గిపోవడం జరుగుతుంది.

వేవిళ్ళు ఎక్కువగా మొదటికన్పులో కనబడతాయి. కొందరిలో ప్రతీసారి కడుపు వచ్చినప్పుడు వేవిళ్ళు కొద్దో గొప్పో కనబడతాయి. సాధారణంగా నెల తప్పిన పదిహేనురోజుల్లో వేవిళ్ళు ప్రారంభం అవుతాయి. ఇలా ప్రారంభమైన వేవిళ్ళు దాదాపు మూడవనెల నిండగానే లేకుండా పోతాయి. కొందరిలో ఇంకో నెలా రెండు నెలలు ఎక్కువ ఉంటాయి.

స్త్రీ గర్భవతి అయినప్పుడు కొద్ది రోజుల్లోనే శరీరంలోఅనేక మార్పులు గలుగుతాయి. శారీరంలో కలిగే అనేక రసాయనిక మార్పులవల్ల కడుపులో వికారం,వాంతులు ప్రారంభం అవుతాయి. అఇతే కొద్ది రోజుల్లోనే శరీరం ఈ రసాయనిక మార్పులకి తట్టుకుని మామూలుగా తయారవుతుంది. దానితో వికారం, వాంతులు రతగ్గిపోతాయి.