పుట:KutunbaniyantranaPaddathulu.djvu/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 168

గర్భం వచ్చినట్లయితే ట్యూబులోని ద్రవం రంగు మారిపోయి లైట్ పింక్ లేదా అసలు కలర్ పూర్తిగా లేకుండానో ఉంటుంది. ఇలా కలర్ మారితే ప్రెగ్నెన్సీ టెస్ఠు పాజిటివ్ వచ్చిందని అంటారు. పాజిటివ్ అంటే గర్భం ఉన్నట్లు అర్ధం.

ప్రెగ్ కలర్ టెస్టు గ్రావిండేక్సు టెస్టుకంటె సున్నితమైనది. గర్భం వచ్చిందీ లేనిదీ గ్రావిండెక్సు టెస్టుకంటే ఇంకా ముందుగా ప్రెగ్ కలర్ టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు. హ్యూమన్ కొరియానికు గొనాడోట్రాపికు హార్మోన్ ఒక లీటర్ మూత్రంలో 800 I U ఉంటే తప్ప గ్రావిండెక్సు టెస్ఠులో పాజిటివ్ రావడం జరగదు. ప్రెగ్ కలర్ టెస్టుకి మూత్రంలో హ్యూమన్ కొరియానికు గొనాడో ట్రాపికు హార్మోను 200 I.U. ఉన్నా చాలు. మామూలుగా గ్రావిండెక్సు టెస్టు ద్వారా గర్భం అయినదీ కానిదీ తెలుసుకోడానికి నెల తప్పిన తరువాత 2 నుంచి 5 రోజులు ఆగవలసి ఉంటే ప్రెగ్ కలర్ టెస్టు ద్వారా నెల తప్పిన రెండవ రోజునే గర్భం అయినదీ కానిదీ నిర్ధారణ చేసుకోవచ్చు.

గర్భం అయినదీ కానిదీ తెలుసుకోవడానికి స్త్రీ మూత్రాన్ని పరీక్ష చేయడానికి రోజులో మొట్టమొదటి సారి పాస్ చేసే మూత్రమే అవసరం లెదు. మూత్రాన్ని ఎప్పుడు పట్టినా పనికి వస్తుంది. అయితే మూత్రాన్ని కలెక్టు