పుట:KutunbaniyantranaPaddathulu.djvu/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 167

ఈ విధంగా నెల తప్పిన స్త్రీ మూత్రాన్ని ఒక చుక్క మాత్రమే తీసుకొని రెండు నిముషాల్లోనే గర్భిణీ అయినదీ కానిదీ నిర్ధారణ చేసి చప్పవచ్చు.

'గ్రావిండేక్స్ ' బదులు 'ప్రెగ్ కలర్ '

'ప్రెగ్ కలర్ ' అనేది మరొక రకమైన పరీక్షా విధానము. దీనిలో గ్ర్రావిండెక్స్ టెస్టులో లాగా కాకుండా "రంగు మార్పు"కలుగుతుంది. అదీగాక పరీక్ష గ్లాసు స్లైడ్ మీద కాకుండా చిన్న ట్యూబులో చేస్తారు.

ఒక ట్యూబులో యాపిల్‌పండు రంగులో చిన్న గోళీ ఉంటుంది. దానిలో కిట్ లో ఇచ్చిన భపర్ సల్యూషన్ మొత్తం వేసేసి గోళి కలిసిపోయేవరకు బాగా కుదపడం చేస్తారు. తరువాత భఫర్ సల్యూషన్ ఖాళీ చేసిన ప్లాస్టిక్ బాటిల్ తోనే మూత్రాన్ని తీసుకుని 3 చుక్కలు రంగు గోళీ కరిగిన ట్యూబులో వేస్తారు. తరువాత ఆ ట్యూబు మూతిని రబ్బర్ కార్కుతో మూసివేసి బాగా కుదుపుతారు.. తరువాత 30 నిమిషాలు అలాగే ఉంచివేస్తారు. అలా ఉంచిన ట్యూబులో ద్రవం ఏ రంగులో ఉందనే దానినిబట్టి గర్భం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడంజరుగుతుంది.

గర్భం రాకపోయినట్లయితే ట్యూబులోని ద్రవం డార్క్ పింక్ కలర్ లోఉంటుంది.