Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 169

చేసిన తరువాత సాధ్యమైనంత త్వరగా పరీక్ష చేయడం అవసరం. కనీసం 12 గంటల లోపు పరీక్ష చేయవలసి ఉంటుంది. 12 గంటలుకంటే ఎక్కువ కాలం పట్టేటట్లయితే మూత్రానికి ధమెరొనాల్ లేదా సోడియం ఎజైడ్ గానికొంత కలిపి రిఫ్రిజిరేటర్‌లో ఒకవారం రోజులు ఉంచవచ్చు. అలా ఉంచిన మూత్రాన్ని వారంరోజుల తరువాత పరీక్ష చేసినా గర్భం వచ్చిందీ లేనిదీ తెలుస్తుంది.

కుటుంబ నియంత్రణ పాటించాలనుకున్న దంపతులకి ఇటువంటి టెస్టులు ఉన్నాయనే విషయం తెలిసి ఉండాలి. ఎందుకంటే ఏ కారణం వలన ఋతుస్రావం రావడం ఆలశ్యమైనా గర్భంవచ్చిందేమోనని భయంకలుగుతూ ఉంటుంది. అటువంటి భయం లేకుండా ఉండటానికి బహిష్టు రావలసిన సమయానికి రాకపోతే మరుసటి రోజునే ప్రెగ్ కలర్ వంటి టెస్టు చేయించుకుని గర్భం అయినదీ కానిదీ నిర్ధారణ చేసుకోవచ్చు. అప్పుడు కావాలంటే గర్భం ఉంచుకునేది, వద్దనుకుంటే గర్భస్రావం చేయించుకునేది. అంతేగాని అనవసరంగా మానసిక ఆందోళన చెందనవసరం లేదు.

* * *