Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 134

ఇచ్చి బ్లేడుతో చర్మానికి గాటు పెడతారు. చర్మానికి పెట్టిన గంటుద్వారా అర సెంటీమీటరు కైవారం వుండే గొట్టాన్ని కడుపులోకి పోనిస్తారు. అలా కడుపులోకి పోనిచ్చిన గొట్టంలో వెలుగునిచ్చే బల్బు ఒకటి వుంటుంది. ఆ వెలుగు సహాయంతో గర్భాశయానికి ఇరుప్రక్కలా వుండే ట్యూబులని గమనిస్తారు. ఇలా ట్యూబులని గమనించిన తరువాత కదుపులోకి త్రోసిన గొట్టంద్వారా మరొక పనిముట్టుతో అండవాహిక అయిన ట్యూబుని లాగి పట్టుకొని రబ్బరు బ్యాండులాంటి చాన్ని దానికి తగిలిస్తారు. అలా బ్యాండుని తగిలిచడంతో అండవాహికం మార్గం ముడుచుకుపోతుంది. ఇదే విధంగా రెండోవైపు కూడా చేస్తారు.

లాప్రోస్కోపీ పద్ధతి ప్రకారం ట్యూబెక్టమీ ఆపరేషను వల్ల సంబవించే దుష్పలితాలు ఏ మాత్రం వుండవు. పైగా ఈ పద్ధతి ప్రకారం చేయించుకున్న వాళ్ళూ ఒక్కపూటలోనే ఇంటికి వెళ్ళిపోయి తమ పనులని తాము చేసుకోవచ్చు. ఈ ఆపరేషను చేయించుకున్న తరువాత ప్రత్యేక జాగ్రత్తలు ఏమీ తీసుకోనవసరం లేదు. ట్యూబెక్టమీలో లాగానే ఇందులోకూడా నడుమునొప్పి, కడుపునొప్పి రావడం, ఒళ్ళు రావడం వంటివి వుండవు. అయితే మామూలు ట్యూబెక్టమీ కంటె యిది అతి సులువైనది, భాధలేనిది.