Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 133

లేదా వెన్నుకి ఇంజక్షన్ ఇవ్వడం ద్వారానో, ఆపరేషన్ చేసేచొట మాత్రమే మత్తు ఇంజక్షను ఇచ్చో ఆపరేషను చేయవచ్చు. కడుపుమీద నుంచి ఆపరేషను చేయడానికి కేవలం ఒక అంగుళం మేర మాత్రమే కోయడం జరుగుతుంది.

ట్యూబెక్టమీ ఆపరేషనులో కడుపుకోసి అండవాహికలైన ట్యూబులను మధ్యకి కత్తిరించి ముడివేసి వదలివేయడం జరుగుతుంది. ఈ రకంగా గర్భసంచికి రెండు వైపులా వుండే ట్యూబులను కత్తిరించడం జరుగుతుంది. ఈ విధంగా ట్యూబులని కత్తిరించడంవల్ల అండాశయాల నుంచి ట్యూబుల ద్వారా అండం ప్రయాణించడం జరగదు. అందువల్ల ఇక గర్భందాల్చడం జరగదు. ఈ ఆపరేషనంతా 15, 20 నిమిషాల్లో చేయడం అయిపోతుంది.

లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ

ఈనాడు లాప్రోస్కోప్‌తో ట్యూబెక్టమీ ఆపరేషన్ల విధానం బహుళ ప్రచారం పొందుతోంది. మామూలుగాచేసే ట్యూబెక్టమీ ఆపరేషనుకంటే ఇది చాల సులువైన పద్ధతి, ఆపరేషను చేయించుకునే వారికి తేలికైనపద్దతి. ఈ పద్ధతి ప్రకారం ట్యూబెక్టమీ చేసేటప్పుడు కడుపుపైన మధ్య భాగంలో ఒక సెంటీమీటరు మేర మత్తు ఇంజక్షను