పుట:KutunbaniyantranaPaddathulu.djvu/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 135

'మినీలాప్ ' ఆపరేషను అంటే ఏమిటి?

స్త్రీలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో ట్యూబెక్టమీ, లాప్రోస్కోప్ ఆపరేషన్లతో పాటు 'మినీ లాప్ ' ఆనేది ఎక్కువ వినబడుతూ ఉంటుంది. 'మినీ లాప్ ' ఆపరేషన్ ఏదో క్రొత్త టెక్నిక్ తో చేసే ట్యూబెక్టమీ ఆపరేషను కాదు. మామూలుగా చేసే ట్యూబెక్టమీ ఆపరేషనునే 'మినీలాప్ ' అని కూడా అంటారు. ట్యూబెక్టమీ కంటే మినీలాప్‌కి పొట్టమీద కాస్త తక్కువ కోయడం జరుగుతుంది. అంతకంటే ఇంకేమీ తేడాలేదు.

'మినీలాప్ ' అంటే మినీ లాపరాటమీ ట్యూబెక్టమీ, దీనిని ముందు 1951 లో జపాన్‌లో ఉకేడా అన్న సైంటిస్టు ప్రచారంలోకి తీసుకుని వచ్చాడు. తరువాత 1983 లో మనీలాలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్సుపర్ట్ కమిటీ వర్కు షాపులో దీనిని ఆమోదించడం ప్రచారంలోకి తీసుకుని రావడం జరిగింది.

మామూలుగా చేసే ట్యూబెక్టమీ లాగానే'మినీ లాప్ ' ట్యూబెక్టమీ ఆపరేషను కూడా ఛేయడం జరుగుతుంది. ఆపరేషను చేయడానికి మత్తు ఇంజక్షను ఆపరేషను చేసే స్థలంలోనే ఇవ్వవచ్చు. లోకల్ ఎనస్థీషియా (లేదా వెన్నుకి మత్తు ఇంజక్షను స్పయినల్ నెస్థీషియా) ఇవ్వవచ్చు లేదా పూర్తి మత్తు ఇచ్చి చేయవచ్చు. దీనినే