Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్దతులు 131

ఏడుపు ముఖంతో నిలబడి "అమ్మగారూ ! నిన్న నా పెళ్ళాం అయిదవ కాన్పులో ఓ ఆడపిల్లని కని, కాన్పులో మరింత రక్తంపోయి ఈ లోకంవదిలి వెళ్ళిపోయింది. ఇంతకుముందు పిల్లలు లేకుండా ఆపరేషను చేయించుకోమంటే భయమేసి వూరుకున్నా. ఈనాడు ఇంతఘోరం జరిగిపోయిందని భోరున ఏడ్ఛేశాడు. ఆండాలమ్మ, అప్పలమ్మల్లోనేకాదు, ఎందరో చదువుకున్న వాళ్ళల్లో కూడా అర్ధం లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపట్ల ఆపోహలు, భయాలు వున్నాయి మరి అసలు నిజం ఏమిటి?

స్త్రీలలో కుటుంబ నియంత్రణ ఆపరేషను

"ట్యూబెక్టమీ" అనేది స్త్రీలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఈనాడు "ట్యూబెక్టమీ" ఆపరేషన్ ఇంత ప్రచారంలోవున్నా పూర్వకాలంలో కూడా ఈ ఆపరేషన్ చేయడం జరిగేది ముఖ్యంగా తల్లి తిరిగి గర్భవతి అవడంవల్ల ఆమె శారీరకంగా, మానసికంగా ఆరోగ్యము మరింత చెడిపోతున్నదని భావించిన పక్షంలోనూ, తల్లి మానసిక వ్యాధి కలిగివుండి బిడ్డని సక్రమంగా పెంచలేని పరిస్థితి ఏర్పడినప్పుడూ, హీమోఫిలియావంటి వంశ పారంపర్య వ్యాధులకి పిల్లలు గురికావడం మంచిగికాదని నిర్ణయించుకున్నప్పుడు ట్యూబెక్టమీ చేసేవాళ్ళు ఈ ఆపరేషన్ కాన్పు జరిగిన మరునాడే చేయవచ్చు లేదా ఇంకె