పుట:KutunbaniyantranaPaddathulu.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. ట్యూబెక్టమీ

ఆరుగురు పిల్లల తల్లి ఆండాలమ్మగారు ఇంట్లో పని చేసుకోలేక సతమతమై పొతున్నారు. దానికీతోడు వారం రోజులనుంచి పనిమనిషి అప్పలమ్మ కూడా రావడంలేదు. ఇక ఇంట్లో కోడలు సంగతి చెప్పనే అవసరం లేదు. నెల తప్పిన దగ్గరనుంచీ ఒకటే వేవిళ్ళు. సరిగ్గా ఒక్క ముద్దయినా ఒంటబట్టిని రోజు ఉండదు. ఇక నీరసం ఉండక ఏమి చేస్తుంది క్రిందటిసారి కాన్పు అవగానే కోడలుకి కుటుంబ నియంత్రణ ఆపరేషను చేస్తే మంచిదని డాక్టరమ్మ చెప్పినా ఓకంతట బుద్దికి ఎక్కలేదు. "ఏమిటో ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు పుట్టేటప్పటికి వీళ్ళ పని అయిపోతోంది. మా రోజుల్లో ఒక్కొక్కళ్ళం డజనేసి పిల్లల్ని కనేయలేదా?" అని డాక్టరమ్మ మాటని ఆండాలమ్మ తోచి పుచ్చింది. "పైగా ఆపరేషను చేయించుకుంటే బోలెడు బాధలు వస్తాయట" అంటూమూర్ఖంగా వ్యవారించి కోడలుకి ఆపరేషను జరగకుండా చేసింది. కోడలుకి వెంటనే మళ్ళీ కడుపువచ్చి వేవిళ్ళతో మంచం మీద పడుకుంటేనేగాని ఈసారి ఆండాలమ్మకి అర్ధం కాలేదు. ఇలా ఇంటిపనితో సతమతమై అలసిపోతున్న ఆండాలమ్మ దగ్గరికి పనిమనిషి అప్పలమ్మ మొగుడు వచ్చి