Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 122

బలహీనతా వచ్చి మాత్రం కాదు. ఆపోహలవల్ల పురుసత్వం పోయిందని, బావించేవాళ్లు కొందరు ఉంటే, మరి కొందరు వేసెక్టమీ చేయించుకున్న తరువాత తిరిగి వీర్య పుష్టిగల యువకులమయ్యామని అంటూ ఉంటారు. వారికి దాంపత్య జీవితంలో పూర్ఫంకంటే తృప్తి ఎక్కువ కలుగుతుందని చెబుతూ ఉంటారు. ఆ మధ్య ఓ వ్యక్తి తన అనుభవంలో తెలుసుకున్నది చెబుతూ వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకొనక ముందు ఎన్ని కుటుంబనియంత్రణ పద్ధతులు అవలంబిస్తున్నా అవి సక్రమంగా జరగక ఎక్కడ గర్భం వస్తుందో అని భయం భయంగా ఉండేదని, ఆపరేషన్ అయిన తరువాత అటువంటి భయానికి తావులేకుండా అయి రతిలో మనస్సు ఉత్తేజంగా ఉరకలేస్తుందని అన్నాడు. ఇది అక్షరాలా నిజం.

ఈ కామవాంఛ భార్యలో కూడా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. భర్త ఆపరేషన్ చేయించుకున్న తరువాత భార్యకు గర్భధారణ భయం వదలిపోతుంది. అసలు ఆ భయమే ఆమెకు రతిలో జడురాలిగా ఉంచుతుంది. కాన్పు అయిన తరువాత కొన్ని నెలల వరకూ భర్తతో రతిలో పాల్గొనడానికే ఆమె భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వెంటనే గర్బం ఎక్కడ వస్తుందో అనే భయం ఉండటమే. ఆ భయంతోనే, బర్తమాట కాదనలేక, భర్త