Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 123

కామాన్ని తీర్చడం కోసం అయిష్టంగానే రతిలో పాల్గొంటుంది. అంతేకానీ తనంతటతాను హుషారుగా ముందుకు రాదు. కానీ భర్త ఆపరేషన్ చేయించుకున్న తరువాత అధిక సంతానం కలుగుతుందన్న భయం వుండదు. కనుక స్త్రీ ఉత్సాహంగా రతిలో పాల్గొంటుంది. భర్తను రతిలో పాల్గొనేందుకు ఉత్సాహపరుస్తుంది. ఇంతకు పూర్వం వరకు భార్య ఇష్టాఇష్టాలని గమనించకుండా తన కామాన్ని తీర్చుకునే భర్త ఇందువల్లనే ఆమెలో కామం ఎక్కువ అయిపోతున్నట్లు, తనలో ఈ ఆపరేషన్‌వల్ల కామం తక్కువ అయి పోతున్నట్లు భ్రమపడతారు. అంతేగాని ఇప్పుడు ఆమె నిర్భయంగా రతిలొ పాల్గొంటున్నదనీ, ఆమెలో ఇంతవరకు అణచుకున్న కామాన్ని స్వెచ్ఛగా వెల్లడిస్తుందని తెలుసుకోడు. పైగా వేసక్టమీ ఛెయించుకున్నందువల్ల, అతనివల్ల ఆమెకు తృప్తికలగక, రతిలో ఇంకా ఇంకా పాల్గొనమని కోరుతుందని భావిస్తాడు. దానివల్ల తనకి రతి సామర్ధ్యం తగ్గినదని భావించి మానసిక నపుంసకత్వం తెచ్చి పెట్టుకుంటాడు కూడాను.

వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నందువల్ల కామ వాంఛలోగాని, కామ సామర్ధ్యంలో గాని, ఏ లోపమూ ఉండదు. ఏమయినా వస్తే అది కేవలం ఆపోహలవల్ల, భయాలవల్ల మానసికంగా తెచ్చిపెట్టుకున్నదే.