పుట:KutunbaniyantranaPaddathulu.djvu/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 121

ముడివేసి, ఆ తరువాత వాటిని మామూలుగా బీజకోశములోకి నెట్టివేసి, బయట చర్మానికి గుట్టువేయడం జరుగుతుంది. బీజకోశానికి రెండువైపులా మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కనుక ఎటువంటి బాధ ఉండదు. ఈ ఆపరేషన్ పది నిమిషాలలోపే తేలికగా అయిపోతుంది.

వేసెక్టమీ ఆపరేషన్ ఛేయించుకున్నా వీర్యస్కలనం మామూలుగానే ఉంటుంది. అందులో వీర్యకణాలు మాత్రమే ఉండవు. మూత్రాశయానికి దిగువున ఉండే ప్రొస్టేటు గ్రంధియే వీర్యరసాలని తయారు చేస్తుంది. కనుక వీర్యంలో ఇంకే లోపమూ ఉండదు. ఈ ఆపరేషన్ చేయించుకున్న తరువాత కూడా అంతకు పూర్వంవలె సంసార సుఖాన్ని భర్త పూర్తిగా పొందగలడు. అతనివల్ల భార్యకు కూడా రతి సుఖం మామూలుగానే లబిస్తుంది. ఎటోచ్చీ గర్భధారణ జరగదు.

వేసెక్టమీ చేయించుకుంటే కామవాంఛ ఏమీ తగ్గదు. పైగా పిల్లలు కలగరు అనే ధైర్యం ఉండబట్టే ఇంతో అంతో కామవాంఛ ఎక్కువ కావటానికి అవకాశం ఉంది. ఎవరయినా ఈ ఆపరేషన్ అయిన తరువాత పురుషత్వం పోయిందనుకుంటే, అది కేవలం భయాలవల్ల మానసికంగా తెచ్చిపెట్టుకున్న దే కాని ఆంగికంగాగాని, శారీరకంగాగాని, ఏ