కుటుంబ నియంత్రణ - పద్ధతులు 119
నలతో తల్లడిల్లిపోయి రతిలో అంగస్తంబనం జరగటం దుర్లభంగా అనిపిస్తోంది. రతిలో పాల్గొనే బ్రతీసారి సంయోగం తనకొక పరీక్షగా తయారయింది.
వాస్తవానికి వేసక్టమీ చేయించుకున్న తరువాత కామేశ్వరరావుకి రతిలో వైఫల్యం మానసిక మైనదే. శారీరకంగా గాని, ఆంగికంగాగాని, హార్మోన్ల పరంగాగాని ఏ లోపము కలిగికాదు. ఆపరేషన్ చేయించుకునే ముందు నుంచీ అతనిలో ఉన్న భయాలే రతి వైఫల్యానికి కారణాలు.
వేసక్టమీ అంటే ఏమిటి?
పురుషులకి చేసే కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ని 'వేసక్టమీ" అంటారు. ఈ వేసక్టమీ శబ్దోత్పత్తిని బట్టి చూస్తే లాటిన్ భాషలో "వాస్" అంటే వీర్యవాహిక, "ఎక్టమీ" కత్తిరించుట. ఈ ఆపరేషన్‌లో వీర్యవాహికను కత్తిరించుట జరుగుతుంది. కనుక దీనికి "వేసక్టమీ' అని పేరు వచ్చింది. పురుషులలో రెండు వీర్యవాహికలు ఉంటాయి. ఇవి బీర్జములకి రెండువైపులా తేలికగా చేతికి తెలిసే విధంగా ఉంటాయి. బీర్జములని వ్రేళ్ళతో అదిమి చూసినట్టయితే గట్టిగా, నున్నగా, సన్నటి నులకతాడువలే ఉంటాయి. వృషణాలనుండి తయారయిన వీర్యకణాలు ఈ వీర్యవాహికల ద్వారా ప్రయాణం చేస్తాయి. ఈ వీర్య