15. వేసక్టమీ
వేసక్టమీ - భయాలు
కామేశ్వరరావు నలుగురు పిల్లల తండ్రి. అయినా వయస్సులో కుర్రవాడే. రెండవ సంతానం కలిగీనప్పటి నుంచీ అతని భార్య సావిత్రి కామేశ్వరరావును వేసెక్టమీ చేయించుకోమని పోరు మొదలెట్టింది. అతనికి ఆపరేషన్ చేయించుకోవాలని ఉన్నా, వేసెక్టమీ చేయించుకుంటే పురుషత్వం ఎక్కడ తగ్గిపోతుందో అనే భయంతో ఇంత కాలం వాయిదా వేస్తూ వచ్చాడు. ఇంతేకాక వేసెక్టమీ చేయించుకుంటే శారీరకంగా అనారోగ్యం కలుగుతుందని, దాంపత్య జీవితాన్ని అనుభవించలేరనీ, వీళ్ళూ - వాళ్ళూ చెప్పే మాటలు అతనిలో పాతుకొనిపోయి వున్నాయి. కాని యెలాగో నాలుగవ సంతానం కలిగిన తరువాత వేసక్టమీ చేయించుకున్నాడు. వేసెక్టమీ అయితే చేయించుకున్నాడు కాని వీళ్ళూ - వాళ్ళూ పెట్టిన భయాలు అతనిలో అనుక్షణం ఆవహించే ఉన్నాయి. చివరికి కమేశ్వరరావు భయపడి నంతా అయింది. అతని భార్య సావిత్రి ఉత్సాహాంతో అతన్ని ఉత్తేజ పరుస్తూ వుంటే అతని కామసామర్ధ్యం సన్నగిల్లి నట్లు భావింఛాడు. చివరికి అతని మనస్సు భయాందోళ