Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 104

బయటకు తీసివేయవచ్చు. ప్రయోజనాత్మకంగా వున్న ఈ పద్ధతి చాలా తేలికగా వున్నా, దీనివల్ల కూడా బహిస్టులు సరిగ్గా ఉండకపోవడం, ఆరోగ్యంలో కొన్ని చికాకులు రావడం ఉంటున్నాయి. ఈ ఇబ్బందులను సరిదిద్దకలిగినట్లయితే ఈ పద్దతి కూడా వీలుగా ఉంటుంది.

యోని మార్గంలో రింగు పద్ధతి

ప్రొజస్టిరోన్ మాత్రలవల్ల, గుళికలవల్ల బహిస్టుల అస్తవ్యస్తత లాంటి బాధలుంటే అటువంటివి అంతగా వుండకుండా యోని మార్గంలో ప్రొజస్టిరోన్ మందుతో తయారుచేసిన రింగు ప్రవేశపెట్టే పద్ధతి మరొకటి ఉంది. బహిస్టు ప్ర్రారంభం అయిన రోజునే ఈ రింగుని యోని మార్గం లోపలికల్లా ప్రవేశపెట్టినట్ల యితే, అందునుండి వెలువడేమందు వల్ల గర్భాశయకంఠము చిక్కని పదార్థము తయారుచేసి గర్భాశయ కంఠద్వారాన్ని వీర్యకణాలు పయనంచేయడానికి వీలులేకుండా మూసివేయబడడం జరుగుతుంది. ఇలా రింగుని మూడువారాలు లోపల వుంచి తీసినట్లయితే మామూలుగా బహిస్టు రావడానికి అవకాశం వుంటుంది. ఈ రింగు యోని మార్గంలొ ఉన్నా సంయోగ సమయంలో ఎటువంటి అడ్దురాదు. ఈ పద్ధతి బాగున్నా యింకా పరిశోధనల దశలోనే వుంది.