Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 105

నెలకి ఒక్కటే బిళ్ళ లేక ఒక్కటే ఇంజక్షన్

ఈస్ట్రోజన్, ప్రొజస్టిరోన్‌తో కలిపి తయారుచేసి ఎక్కువ మోతాదు గల బిళ్ళ నెలకు ఒకసారే వేసుకుంటే సరిపోయే విధంగా తయారు చేయడం జరిగింది. కాని ఈస్ట్రోజన్ హార్మోనులవల్ల కలిగే వికారాలు ఈ మాత్రలో కూడా తీసివేయకపోవడం, ఇతర ఇబ్బందులవల్ల ఈ మాత్ర యింకా పరిశోధనాలయంలోనే ప్రయోగాల మధ్య ఉండిపోయింది. అదే విధంగా నెలకి ఒక ఇంజక్షన్‌గా ప్రొజస్టిరోన్ హర్మోను ఉపయోగించినా, దీనవల్ల కూడా అంతగా సంతృప్తికర ఫలితాలు కనబడలేదు.

మగవాళ్ళలో వీర్యకణాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిరోధించే పద్దతి గురించి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవే విజయవంతమయినట్లయితే యిక స్త్రీలు మాత్రలు వేసుకోవడం మానివేసి, భర్తని రోజూ మాత్ర మింగావా లేదా అని సంజాయిషీ చేయవచ్చు.

వా క్సి న్

మశూచి, కలరా రాకుండా ఏ విధంగా వ్యాధి నిరోధక ఇంజక్షన్స్ వున్నాయో అదే విధంగా సంయోగ సమయలో యోని మార్గంలోకి ప్రవేశించిన వీర్యకణాలని నిర్మూలించేందుకు వాక్సీను తయారుచేయాలని కృషి ప్రారంభం