Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 103

లోకి ప్రవేశించలేవు. ఈ మాత్రలు వాడుతున్నప్పుడు గర్భాశయం లోపలి పొరకూడా అండము ఎదుగుదలకి అనుకూలంగా లేకుండా తయారవుతుంది. అందుకని ఒక వేళ ఏదో ఒక విధంగా వీర్యకణాలు గర్భాశయంలోకి ప్రవేశించి అటుపై న అండవాహికల్లో అండంతో కలయిక పొంది గర్బాశయంలోకి పిండంగా ఎదగడానికి చేరినా గర్భాశాయము అందుకు అనుకూలంగా ఉండదు. కడుపులో వికారం లాంటిది కలగకపోయినా బహిస్టుల విషయములో అస్తవ్యస్తత ఎక్కువగా కలగడంవల్ల, ఈ బిళ్లలు కూడా రోజూ వేసుకోవలసి ఉండటంవల్ల ఈ క్రొత్త మాత్రలకి తగిన ప్రోత్సాహం లభించటం లేదు.

చిన్న గుళీకతో సంతాన నిరోధం

ప్రొజస్టిరోన్ తయారుచేసిన మందు గుళిక ఒకదానిని ఒకసారి చేతి దగ్గర చర్మం లోపలికి ఎక్కించేసినట్లయితే రోజూ మాత్రలు మింగే పని లెకుండా పోతుంది. ఇలా చర్మం లోపలికి పంపిన గుళికనుంచి నిదానంగా మందు వదలబడుతూ గర్బం రాకుండా అరికట్టుతుంది. ఈ గుళిక పెన్సిల్ మొన అంత చిన్న సైజులో ఉండి ఒక పెద్ద సైజు సూదిద్వారా చర్మం క్రిందకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. తిరిగి ఎప్పుడు పిల్లలు కావాలనుకుంటే అప్పుడు ఆ గుళికని