పుట:KutunbaniyantranaPaddathulu.djvu/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 102

లక్షణాలు వస్తున్నాయి. అందుకని కేవలం ప్రొజస్టిరోన్ తొనే తయారుచేసిన కుటుంబనియంత్రేణ మాత్రలు ప్రయోగాత్మకంగా వాడటం జరుగుతోంది. వీటివల్ల ఎటువంటి వికారం కడుపులో లేకపోయినా, ఈ మాత్రల కుండవలసిన ఇబ్బందులు మరొక రకంగా వుంటున్నాయి. ఈ ప్రొజస్టిరోన్ మాత్రలు వాడే వాళ్ళలో బహిస్టులు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. మామూలుగా వాడే మాత్రలవల్ల అండము విడుదలంటూ వుండదు.

క్రొత్తరకం మాత్రలతో క్రొత్త ఇబ్బందులు

కాని ఈ కొత్తరకం బిళ్ళలు వాడే వాళ్ళలో అండం విడుదల మామూలుగానే ఉంటుంది. కాని వీర్యకణాలతో కలయిక పొంది పిండంగా ఎదగడం జరగదు. ఈ క్రొత్త మాత్రలు వాడేవాళ్ళు, ఏ ఒక్కరోజు అయినా మాత్ర వాడటం మరిచిపొతే వెంటనే గర్భం రావడానికి అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అండం విడుదల వుండి కూడా ఈ మాత్రలు వాడుతూ వుంటే గర్భము రాకుండా ఎలా వుంటుందని అనుమానం కలగవచ్చు. ఈ మాత్రలు వాడుతున్నప్పుడు గర్భాశయ కంఠంలో చిక్కని ద్రవంలాటిది ఎక్కువగా తయారవుతూ ఉండి గర్భాశయ కంఠాన్ని మూసివేసి వుంచుతుంది. ఇలా ఆ చిక్కని ద్రవంవల్ల గర్భాశయానికి దారి అడ్దుపడి ఉండబట్టి వీర్యకణాలు గర్భాశయం