పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

భంఊణాఖూ గొంచెము పూర్వమోయుండిన మనవారి రాజ్యాంగస్థితి వర్ణించినదగుటచేత ఆవివరము నీక్రిందవ్రాయుచున్నాము. "పరశురాముని బారినుండి తప్పించుకొనిన క్షత్రియులు ఏకమై ఈనియమము నేర్పరచుకొనిరి. ఈవిధిని సూర్యచంద్రవంశముల వారిరువురును ఒప్పుకొనిరి. ఇళకును ఇక్ష్వాకునకును జనించిన వారందరు నూర్గుగని మీరెరుగుదురు. యయాతివంశజులగు భోజులు నలుదిశలయందును లెక్కకు మిక్కిలిగా నున్నారు. ప్రస్తుతము రాజులందరును తమలో నెల్ల మిగుల బలవంతుడగు జరాసంధుని సామ్రాట్టుగా నెన్నుకొని యున్నారు. కనుకనే అతడు మధ్యదేశముననుభవించుచున్నాడు. శూరుడగు శిశుపాలుడు అతని సర్వసేనాని యైనాడు. కరూశ రాజగు వక్రదంతుడు అతనికి సహాకుడై యున్నాడు. పశ్చిమముననున్న యవనుల రాజగు భగదత్తుడు అసంఖ్యసేనలు కలవాడు, మురనరకులను తనకులోబరచుకొని తటస్థుడుగా నున్నాడు. పశ్చిమదక్షిణదిశల యందున్న కుంతిబోజపురుజిత్తు ఒకడుమత్రము నీకు మిత్రుడు. వంగదేశవసకులు, పౌండ్రక కిరాతులకును, రాజగు వాసుదేవునితో గూడి భీష్మకుడు జరాసంధపక్షపాతియైయున్నాడు. ఉత్తరదేశపు రాజులలో ననేకులు--పాంచాల, శూరసేన, మత్స్యదేశాధీశులును తదితరులును-జరాసంధునకు భయపడి దక్షిణమునకు బారిపోయినారు. ఎంతబలముగలవారైనను, ఎంతసమర్ధులమైనను మేముకూడ మధురవదలి దుర్భేద్యమైనదియు, స్త్రీలవలన నైనను రక్షింపబడవీలైనదియు నగు కుశస్థ