పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారు సాధారణ రాజ్యూంగస్థితి

గా గలవారుగను నుండుటచేత వారు స్వతంత్రస్వభావులై నాయక సత్తాకరాజ్యముల నేర్పరచుకొనగలిగి మనదేశమందలితూర్పు భారములోని మగధవంటివిశాలదేశములలో అనార్యజాతులు ఆర్యానార్యసంయోగమువలన గలిగినమిశ్రమజాతులును విరివిగా నుండుటచేత అట్టిదేశములుజ్ ఎక్కువనిరంకుశపరిపాలనము కల వయ్యెను. 'దత్తు 'కృతమగు "పురాతనహిందూదేశసభ్యత"యను గ్రంధమునందుల్లేఖింపబదినది. ఐతరేయబ్రాహ్మణములోని ఈక్రింది వచనమువలన పైయంశమే స్థిరపడుచున్నది. ఈయర్ధమనగా కమరేయర్ధమునను ఈవచనమును సమన్వయించుటకు వలనుపడదు. "తూర్పుదిశయందలి రాజులు సామ్రాట్టులను బిరుదముల నందిరి. దక్షిణదిశస్వారు భోజులనిపిలువబడుదురు. అశ్చిమదేశీయులకు రాజులే లేరు. మధ్యమదేశముల రాజులు రాజులనియేపిలువబడుచున్నారు" అనగా తూర్పుదేశపురాజులు క్రమక్రమముగా నిరంకుశులగుచుండిరనియు, పశ్చిమదేశ జనులు ఇంకను స్వతంత్రులుగానుండి స్వపరిపాలనము కలిగియుండి రనియు తేలుచున్నది.

        విదేహదేశపురాజగు జనకునితో ఉపనిషత్తులయందు వాడబడియున్న సామ్రాట్టు బిరుదము కాలక్రమమున 'రాజాధిరాజు ' అను నర్ధమున నుపయోగింపబడసాగినది. తూర్పుదేశమునందలి రాజులు బలవంతులగుటతో దృప్తిజెందక "సామ్రాట్టు" బిరుదమును గూడ కాంక్షింపసాగిరి. ఇంద్రప్రస్థమునకు రాజైన యుధిష్టిరుడిట్టి బిరుదమును బొందగోరిన సందర్భమున, మహాభారతమునందు, ఈబిరుదుమెట్లుత్పత్తియైనదియు కృష్ణుడు వివరించియున్నాడు, క్షాత్రయుగారంభముననో, బౌద్ధయుగారం