పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగము హింద్వార్యులు.

క్రింద నునిచి వారిని ఇచ్చవచ్చినట్లు మార్చుచు రాజ్యము చేయు పద్దతి నారంభించినాడు డెరయను (Darius) అనియు తోచుచున్నది. అస్సీరియనులు (Assyrians) గాని ఇజిప్షనులు (Egyptians)గాని ఇట్టి యత్నము చేయలేదనియు, ప్రపంచమందలి మొట్టమొదట నిజమైన నిరంకుశచక్రవర్తి (Autocratic Emperor) డెరయనెయై యుండవచ్చుననియు మాతలంపు. కనుక సింధునదికి పశ్చిమముననున్న దేశమును వశపరచుకొని, దానిని తనపారసీక సామ్రాజ్యమున గలుపుకొని యొకసాత్రవుని క్రింద నుంచియుండిన డెరయనుయొక్క పద్ధతిని మనవారు--అందును ముఖ్యముగా విశాలరాష్ట్రముల కదినాధులగు తూర్పుప్రాంత ములవారు-ఆదర్శముగా గొనియుండిన నందాశ్చర్య మేమియులేదు. బహుశ: ఇతే చిన్నచిన్న రాజ్యములను పొట్టబెట్టుకొని నిరంకుశుడగు చక్రవర్తి పాలనము క్రింద మనదేశమున మొట్టమొదట హిందూదేశ చక్రవర్తి యగు సాంద్రకోటను అని గ్రీకులచే బిలువబడిన చంద్రేగుప్తుడు రాజ్యము చేసెను. ఈతని యాస్థానముననే మెగస్తనీసు (Megasthanes) అను చరిత్రకారుడు రాయబారిగా నుండెను. వీరకావ్యములందు పాటలీపుత్రముమాట ఎచ్చటను లేదు. మధరాజ్యమునకు రాజగృహ పట్టణమే రాజధానియని రెండు కావ్యములందును పలుమారు వచ్చినది. తరువాత కాలమున నుద్భవించిన సామ్రాజ్యములమాట కూడ వీరకావ్యములలో లేదు.