పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

మున నీపద్ధతి క్షాత్రయుగారంభమునకు పూర్వమే మొదలై దాదాపు తద్యుగాంతమువఱకు నట్లేలెయుండెను. ఆరంభమున వచ్చిన యార్యులతెగలు పశ్చిమోత్తర ద్వారముల ఈదేశమున ప్రవేశించి ఇచ్చటి సుఖప్రద ప్రాంతములలో పంజాబునుండి కోసల, విదేహదేశ ములవఱకు హిమాలయ పరిసరములలో నివసించిరి. ఇక *రెండవ మారీ దేశమున బ్రవేశించినవారు తమకెంటె పూర్వము వచ్చినవారిని కదలింపక యమునాచేంబలు నదీతీరములందు మాళవ గుజరాతు ప్రాంతాలలో నానాముల నేర్పఱచుకొనిది. ఈ విధముగా లెక్కకుమించిన తెగలు అనగా రాజ్యములు ఈదేశమున నేర్పడెను. ఇట్టి రాజ్యముల వేళ్ళు లీరకావ్యములందు పలుమారు వచ్చియున్నది. మెగస్తనీసు ఇట్టిరాజ్యములను 112 టిని పేర్కొని యున్నాడు. ఈ సంఖ్యకు మనమచ్చెరువొందవలసిన పనిలేదు. ఎందుచేతననగా ఒక సింధు పంజాబు దేశములలోనే లెక్కకు మిక్కిలియగు వేర్వేరు తెగలవారి రాజ్యములను అలెగ్జాండదు గెలువవలసిన వాడయ్యెనని మనము చదివియున్నాముకదా! అది యట్లుండె. రాజ్యములను స్థాపించుట ఎఱుగరని తోచుచున్నది. మన వారి రాజ్యమనగా, కొన్నివేళల, గ్రీకువారి రాజ్యమువలెనే


   *వైద్యాగారు ఈదేశముమీద ఆర్యులు దండయాత్రలు రెండు మారులు జరిగినవని తలచుచున్నారు. ఇట్టి యూహకు కారణములు మాత్రము చూపి యుండ లేదు. ఒక క్రొత్తదేశమునకు నివసింపబోవువారు రెండు మారులు మాత్రమే పోయియుండిరని సాధించుట ఎట్లోమాకు దురూహ్యముగనున్నది.