పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి సాధారణ రాజ్యాంగస్థితి.

ఒక పట్టణమును ఆపట్టణవాసులు వ్యవసాయము చేసికొనుటకు అవసరమగునంత వైశాల్యముగల చుట్టు ప్రదేశమేయైయుండెను. ఐదూళ్ళు మాకిచ్చిన చాలునని ధర్మరాజు దుర్యోధనునకు సంధి సందేశమంపియుండేను. అనగా ఐదురుగు సొదరులకును ఐదురజ్యములు వచ్చినజాలుననియు, ఆంతమాత్రము లభించెనేని క్షత్రియుడగు వాని మనస్సునందుండు అధికారాసక్తి నెరవేరుననియు ధర్మజుడు తలచియుండెను. అప్పుడేకాదు, నేడును క్షత్రియుడగువడు ఒక గ్రామమునైనను సరేతాను సర్వస్వతంత్రుడుగా నేల గోరుచున్నాడు. క్షత్రయుగారంభమున ప్రతిఅట్టణమునకు నొకరాజుండినట్టు ఈక్రింది శ్లోకమువలన దెలియుచున్నది. *"తమకు తాము ప్రియము చేసికొను రాజులు ప్రతిగృహముననుకలదు. కాని వారిలో నొకడును సామ్రాట్టుకాలేదు. అట్టి బిరుదును సంపాదించుట కష్టము" అని భారతవర్షంఉనకు జక్రవర్తి కాగోరుచుండిన ధర్మజుడు పలుకుచున్నాడు. ప్రతిపట్టణమునకును రాజొకడుండె ననువచన మునుబట్టి చూచినచో, అట్టిరాజులకు పైవాడగు సామ్రాట్టు ఈ చిన్న రాజ్యములను రూపుపామకవారియొద్దనుండి కప్పములను గాని బహుమనములుగాని గొనుటలో తృప్తినొందుచుండేననికూడ తోచుచున్నది. జయింపబడిన రాజును పదబ్రష్టుని జేయగూడదనియు, అతని మరల స్వస్థానమున నిలుపవలయు ననియు, అతడు మృతుడైనచో ఆతని కుమారునకుగాని


  • గృహేగృహే విరాజన, స్వస్యన్య ప్రియంకరా: ! నిచ

సామ్రాజ్యమాస్తానే, సామ్రాట్ శబ్దో నిక్సచ్చమన్ సిసభా॥