పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి సాధారణ రాజ్యాంగస్థితి.

వారిస్థితియు, గ్రీకార్యులస్థితియు ఒకటిగానే మనకు గానవచ్చును. గ్రీకుదేశములోవలెనె మనదేశమునందును చిన్న చిన్న పట్టణ రాజ్యూములు (City States) ఏర్పడియుండెను. వీనిలో నొక్కొక్క రాజ్యమొక్కొక్కతెగవారి పాలనకు లోనైయుండెను. ఇట్టి ప్రతిరాజ్యము ఆతెగవారిలో ప్రముఖుడుగానుండిన ఎవరైన రాజుపేరుననో, ఆరాజ్యమునందలి ముఖ్యపట్టణము పేరునో పిలువబడుచుండెడిది.ఇప్పటికాలపు పెద్ధరాజ్యములను చూచుచున్న మనకు గ్రీసువ్ంతి చిన్నదేశమున నిన్నిస్వతములగు పట్టణ రాజ్యము లేట్లుండెనోకదాయని యబ్బురము తోచును. మనదేశము గ్రీకుకంటే వైశాల్యమున నెన్నియో రెట్లు పెద్దది కనుక ఆకాలమున మనదేశమందుండిన పట్టణ రాజ్యూములు గ్రీసుదేశపు వానికంటె వితాలతరములుగన యుండవచ్చును. అయినను, అంతమాత్రమున నవి ఇప్పటికాలపు రాష్ట్రములతో దూగదగినవని తలపగూడదు. గ్రీసుదేశములోవలెనే మనదేశమున నివసించు చుండిన వేర్వేరుతెగలు ఒక విధమైన దేవతలనే యారాధించుచు ఒకభాషయొక్క భిన్నశాఖలనే మాట్లాడుచుండిరి.ఆచార వ్యవహరములందును, మతవిశ్వాసములందును వారియందు విశేషభేదముండలేదు. వారిలొ పరస్పరవివాహములు జరుగు చుండెను. ఇట్లుండియు రాజ్యాంగ విషయములందు మాత్రము వారు స్వతంత్రులై ఒండొరుల జయింప నిచ్చగలవరై యుండిరి. కనుక వారు సర్వదా యుద్ధములు చేయుచుండిరి. అయినను వారు పరరాజ్యముల స్వాతంత్ర్యమును మాత్రము గౌరవించుచునే యుండిరి. మనదేశ