పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యాహారము.

ఇట్టిసదభ్యాసము బ్రాహ్మణునకుహింద్వార్యులలో నున్నత స్థానము నొసంగిన కారణములలోనొకటి. అప్పుడును ఇప్పటివలెనే బ్ర్రహ్మణులలో కొందఱు వంచకులుగూడనుండిరి. మొత్తము మీద బ్రాహ్మణులయందున్న ఈసదాచారము తక్కినవారిని సన్మార్గము నకు ద్రిపుటకు కారణమయ్యెను. కనుకనే "యాగాదులంచు తప్ప వారెప్పుడును మద్యపరముచేయరు" అనుమెగాస్తనీసు వచనప్పను స్ట్రాబో ఉదాహరించియున్నాడు.++

   ఈ ప్రకారము క్షాత్రయుగమున హించువులు గోహత్యను గోమాంసమును పూర్ణముగ విడిచిపట్టెరి. క్షత్రియులుతప్ప తక్కినవారందరు మద్యపానమును దాదాపుగా మానుకొనిది అయినను ఈ సిద్ధాంతమునకు కొన్ని నిషేధములు లేక పోలేదు. గంగానదీప్రాంతవాసులగు నార్యులు సంఘ, మతసం స్కారములందు పురోగాములై యుండ పంజాపుదేశపు టార్యులు పూర్వాచారపరాయణులైయుండిరి. కావుననే పంజాబువరిలో వివాహసంబంధములగు పూర్వాచార ములనేకములుండెను. వారు జాతిభేదమునకు పూర్తిగాలోబడినవారుకారు. ఆహారపానీయమ్లలో సైతము వారు తమతొంటిమార్గమును వదలలేదు, కావుననే గంగానదీప్రాంతవాసులు పంజాబువారిని నీతిహీనులుగా దలచుచుండిరి. మహాభారతములోని కర్ణపర్వమునందు ఒకశ్లోకము కలదు. !"గోవర్ధనమనునది మఱ్ఱిచెట్టు; సుభద్రయను

++ ఇది సోమపానముకాబోలును, అని మాక్ క్రిండల్ వ్రాసినాడు

!గోవర్ధనోపానమటు, సుభద్రంనామదత్వరం, ఏకద్రాజకులద్వారమా సమాంత్స్మరామ్యహ॥ కర్ణకి