పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హిద్వార్యులు.

నది చత్త్వరము. ఇది చిన్నతనమునుండి నేనెఱిగియున్న రాజకులద్వారము." అని యాశ్లోకమునకర్ధము. అనగా గోవధశాలయు, సురాభాండాశ్రయమును రాజమందిరద్వారమున తప్పక యుండునని దీని భావము. గోవధమును మధ్యపారమును గంగానదీ ప్రాంతవాసులగు నార్యులు అసహనముతొ జూచుచుడిరి. ఇంకొకశ్లోకమున నిట్లున్నది. "బియ్యముతో జేయబడిన మద్యమును ద్రావునట్టియు గొడ్దుమాంసమును ఉల్లిగడ్డలను, ఆపూసమాంసమును, వేయించిన ధాన్యమును తినునట్టి పంజాబు దేశవాసులు దుర్వర్తనము కలవారు" అప్పటివఱకును పంజాబు దేశపు స్త్రీపురుషులు గొడ్దుమాంసమునుదిని మైకమెత్తునట్లు మద్యమునుద్రావి రాత్రిందినములు స్వేచ్చావిహారము సల్పుచుండిన కారణమువలనె, గంగానదీ ప్రాంతవాసులగు నార్యులు వారిని హేయభావముతో జూచుచుండిరి. పంజాబుదేశపు టార్యులు ఈ విధముగా వెనుకబదియుండినను కాలక్రమున వారును గోవధను మహాపాతకముగా లెక్కించి తక్కుంగలవారి యభిప్రాయములతో నేకీభవించిరి.

  ఆహారవిషయమున సర్వార్యజ్నసమ్మతమైయుండిన పైనియమ మును పాటింపనిజాతిమఱియొకటి యుండెను. అది సారస్వత బ్రాహ్మణజాతి. పొలసులేని చేపలను క్షాత్రయుగమునాటి బ్రాహ్మణుడు తినగూడరు. అట్టి యాచారమునకు విరుద్ధముగా నాటినుండి నేటివరకు మత్సములను దినుచుచుండు సారస్వత బ్రాహ్మణులయొక్క యాచారమును దెలుపుగాధ యొకటి శల్య పరములోని సరస్వత్యుపాఖ్యానముననున్నది. ఒకప్పుడు హిందూ