పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నవి. *కనక క్షాత్రయుగాదియందు బ్రాహ్మణులు ఈ నిషేధమును పాటించియుండిరేమో! అదెట్లుండినను, క్షాత్రయుగములోపల మాత్రము వారు మధ్యమును పూర్తిగా వదలుటయే కాక, దానిని ఆర్యేతరకార్యముగా భావించియుండిరనుట నిస్సంశము. ఈ విషయమునుగూర్చిన యొక వచనము శాంతిపర్వములోని 141 అధ్యాయమున విశ్వామిత్ర చండాలుర కధ యందున్నది. కఱవు కాలమున నొకనాడు విశ్వామిత్రుడు క్షుద్భాధాపీడితుడై యొక చండాలుని గృహము ప్రవేశించి చచ్చిన కుక్కకాలును తినుటకై తస్కరించెను. అప్పుడు విశ్వామిత్రునకును చండాలునకును, విశ్వామిత్రుని వర్తనమును గుఱించియు, బ్రామణుడగువాడు మాంసము తినవచ్చునాయనుటనుగుఱించియు నొక సంభాషణము జరుగుని. సంభాషణాంతమున, ఆహారవిషయమున ఈ నియమమును పాటింపకపోయినచో దోషముకాదనియు, "పతిత" శబ్దము త్రాగుబోతు విషయమున మాత్రమే వర్తించుచున్నదనియు విశ్వామిత్రుడు చెప్పియున్నాడు. +శాంతిపర్వములోని 120 వ అధ్యాయములో మోక్షధర్మప్రశంసయందు మఱియొక శ్లోకమున్నది. ఇంద్రుడు జంబుకరూపమున వచ్చి బాధితుడగునొక బ్రాహ్మణు నూఱడించుచుబ్రాహ్మణులగొప్పతనమునుగ్గడించుచునిట్లనును. "మధ్యము లత్వాకపక్షిమాంసము, ప్రపంచములోని సమస్త ప్రదార్ధములయందును ఎక్కువ రుచిగలవి అట్టివారినినీవు కలలోనైన" తలంపవు.


  • చాందోగ్యోపనిషత్తు 10 కాండము

+వైవాతిపాపంభక్షమాణస్య దృష్టంసురాంతు పిత్త్వానతతీతగోబ్ద:॥