పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారియుడుపులు.

నందును ఉండవచ్చును. ధృతరాష్టృడు పుత్రుని శరీరము కృశించి నందునకు గారనము నడుగు సందర్భమున నిట్లనినును "నీవు ప్రావారనస్త్రములను ధరించుచున్నావు. మాంసముతో నన్నమును భుజించుచున్నావు. దివ్యాశ్వముల నెక్కి సవారీచేయుచున్నావు. ఇట్టి నీవు కృశించుటకు గారణమేమి?" 'ప్రావారనస్త్రము ' లనగా నేమో వ్యాఖ్యాతవివరించలేదు. అయినను పైశబ్దమునకు మనము అందమైన వస్త్రములని యర్ధము చెప్పిన చెప్పవచ్చునని తలచెదను. శరీరోర్ద్వభాగము నాచ్చాదించుచుండిన రెందవ వస్త్రమును గుఱించి మనకంతగా దెలియదు. మతగ్రంధములళో వచ్చిన 'ఉత్తరీయ ' శబ్ధమునుబట్టి మన మీరెండవ వస్త్రముండెనని నిశ్చయించుకొనవలసిన వారమైతిమి. ఈవస్త్రము వెనుక జెప్పిన ప్రకారము శరీరోర్ద్వభాగమున గప్పికొనబడుచుడెడిది. కొన్ని వేలలయందు కుడిచేయి అనాచ్చాదిత ముగా వదలివేయబడు చుండెను. అట్టి సమయమున నీయుత్తరీయము కుడిచంకక్రిందనుండి యెడమభుజముమీదికి బోవుచుండెనని యూహిమపవలయు ' నని మనుస్కృతి విధించి యున్నది. *దీనికి వ్యాఖ్య్హత ఉత్తరీయము కప్పక బయటకు దీసియుంచవలయునని యర్దము చెప్పియున్నరు. పురరనకాలపు హింద్వార్యులు యుద్ధసమయములందు ఉత్తరీయము నిట్లే వైచికొని దాని చెఱగులను ఎడమభుజముపైన గట్టిగామిడివేసికొనుఛుండి రని తొచుసున్నది. _____________________________________

  *నిత్యముద్ధృతపాణిస్యాత్.