పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

   పురుషు లా కాలమున ధరించుచుండిన  యుడుపు లనగా, ఎక్కువ పొడవు తక్కువ వెడల్పుగల రెండు విడివస్త్రములు మాత్రమే యైయుండవచ్చును. ఒకటి కట్టుకొనుటబడునది. రెండవది కప్పుకొనబడునది. మొదటిది నడుముననుండి క్రిందిభాగమును గప్పుచుండెను; రెండవది నడుము మీదిభాగ్ము నాచ్చాదించుచుండేను. ఈ యూహ కేవలము కల్పితమైనదని తలపగూడరు. ఇది సప్రమాణమనుట నిస్సంశయము, ద్రౌపది కౌరవసభలోనికి లాగికొని రాబదినపుడు, దుర్యోధనుడు ఆమె చూచుచుండగా దన కుడ్తొడమీది వస్త్రమును దొలగించెనని మహాభారమందున్నది. దాదాపుగా నిన్నటికాలమున వాడుక యందున్న విధమున ధోవతిగట్టికొనిననే కాని అతడట్లు తన కుడితొడను అనాచ్చాదితముగా జేయుట సంబవింపదు. రాజు మొదలు జనసామాన్యమువఱకు నందఱును ధోవతినే కట్టుకొనుచుందినట్లుకూడ తోచుచున్నది. భేధమేమైన సుండినచో వస్త్రముయొక్క మృదలత్వమునందును నేతయొక్కసన్నదనము

ఏ, ఎల్, ఎల్, బి గారు క్షాత్రయుగము వైశాల్యమును ఇంచుమించుగా క్రీ.పూ.3000 నుండి క్రీ.పూ.250 వఱకు నిర్ధారణచేసియున్నారు. వీరి యభిప్రాయముతొ నంద ఱేకీభవింపకపోయినను, వీరు చెప్పిన యంశములను వివరములను మనసు పాశ్చాత్యవిద్యాంసులచే నిశ్చయింపబదిన క్షాత్రయుగమునకే వర్తించునవి యని యూహించుకొనవచ్చును. వైద్యాగారి మతమున భారతయుద్ధమును క్రీ.పూ.3101 వ సంవత్సరమున జరిగినది. గ్రంధము తరువాత కొలదికాలమునకేవ్రాయబడెనని వారభిప్రాయపడుచున్నారు.