పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

    వెనుక జెప్పబడియున్న రెండు వస్త్రములు తప్ప, అధవపక్షము క్షాత్రయుగారంభమున, హింద్వార్యులు మఱే యడుపులను ధరించియుండినవారు కారు. లాగులు జాకెట్లు ఎట్టివో వరెఱుగరు, కోట్లు చొక్కాలు వారికి దెలియవు. బట్టలను గత్తిరించి తీరుతీరు ఉడుపులుగా గుట్టుట ఆ కాలమున లేదు. కుట్టుపని మొట్టమొదట బహుశ *'సెమిటిక్కు 'లలో బుట్టినదై యుండవచ్చును.  అది గ్రీకులు పంజాబుదేశమును జయించిన కాలముననో, అంతకు బూర్వము హింద్వార్ల్యులకు పారసీకులతో సంబంధము కలిగినట్టి డెరయను పరిపాలన కాలముననో మనదేశముల్న బ్రవేశించి యుండవచ్చును. రామాయణమున z కుట్టుపనివాడు వచ్చియున్నాడు, కాని మహాభారతమున వానిజాడ ఎచ్చటను కానరాదు. ఇంతమాత్రమున మహాభారతము రచింపబదిన కాలమున కుట్టుపనివాడు ఉండనేలేదను X అభానవాదమున కవకాశము లేదు. అది యటుండ నిండు, మొత్తముమీద క్షాత్రయుగారంభమున హింద్వార్యులలో పురుషులు రెండువస్త్రములలో నొకదాని గట్టికొని రెండవదాని గప్పుకొనుచుండిరని విశ్వసించుటయందభ్యంతర మేమియు లేదు.

___________________________________________

  • ఇది ఏష్యాఖండముయొక్క పశ్చిమభాగముననుండిన యొకజాతి.

z తున్నవాయి

X అభావవాదమనగా, ఒకగ్రంధమున ఒకానొకవస్తువు ప్రసక్తిలేదు. కనుక ఆగ్రంధము రచింపబడిన కాలమున అట్టివస్తువే యుండలెదని వారించుట.