పుట:Krxshhiivaludu (1924).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బక్షు లెల్లను గూళుల బట్టి చనగ
నచ్చతచ్చట దారక లవతరింప
మొలకచీకటి దిక్కులు మలినమయ్యె,
సంజ రాతిరి గర్భాన సమసిపోయె. 114

ఇంతకు రాడు కాంతుడని యింతి విచారముతోడ ద్వారబం
ధాంతరమందు నిల్చి కనులార్పక దారులు చూచుచుండ నీ
వంతగ నాలసింప దగవా, మగవారలయట్ల కాతర
స్వాంతలుగాక, కామిను లనాగతకష్టము లెంతు రెప్పుడున్‌. 115

ఆయెను రచ్చలోని వ్యవహారము, లూరక పొల్లుమాటలం
బోయెను నర్ధరాత్ర, మికబొమ్ము గృహమ్మునుజేర, బిడ్డలున్‌
నాయన నాయనంచు కరుణమ్ముగ నేడ్చుచునున్నవారు, ము
న్నాయితపెట్టె స్నానమునకై నులివెచ్చని నీరు భార్యయున్‌. 116

లయవిభాతి



చలువగల కప్పురము చిలికినటు చల్లనయి
          లలితకలధౌత మృదువిలసనము పోలెన్‌
మొలకలిడు వెన్నెలల చెలువము దిగంతముల
          కలముకొని తారకల తళుకులను గప్పం