పుట:Krxshhiivaludu (1924).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖారమణీయతం జిలుక గాలువనీటికి నేగు కన్యకల్‌
వారక కొంతసేపు కనువాల్చక చూతురు విస్మయంబునన్‌. 111

గోపద ధూళి ధూసరిత గోపకుమారులు కాపుపిల్లలున్‌
మూపున కఱ్ఱలుం జలిదిబోనపు దుత్తలు, చంకలోన బె
న్మోపెడు దూడపల్పు లిడి మోహన వేణురవంబు సేయుచున్‌
మాపటివేళగా బసులమందలు దోల్కొనివచ్చి రిండ్లకున్‌. 112

స్వారిచేయు నిచ్చ భావంబు కలిగింప
బఱ్ఱె నెక్కి వచ్చు బాలు డొకడు;
వాని క్రిందద్రోయువఱకు బఱ్ఱెను బాది
సంతసించు రితరసఖులు నగుచు. 113

బడి విడిపించంగ బాలురు వీథుల
          బరుగెత్తి యుప్పరపట్టెలాడ,
పంటచేలకు పనిపాటుల కేగిన
          కర్షకు లిండ్లకు గదలుచుండ,
స్నానంబు లొనరించి సరసుల భూసురుల్‌
          భక్తిభావన సంధ్య వార్చుచుండ,
సందాకవళమమ్మ సత్తెమేజయమని
          యన్నార్థులగు భిక్షు లరుగుదేర