పుట:Krxshhiivaludu (1924).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమరిపోతవై జనకుసూక్తు లలక్ష్యముచేసి కొంటెపో
రాముల బ్రొద్దుపుచ్చకు, నిరర్థకభూములనైన జెమ్మటన్‌
శ్యామల సస్యవంతముగ సల్పెడు కాపులు నోగులైన నిం
కోమెడువార లెవ్వరు జనోత్కరమున్‌ సరసాన్నదాతలై. 16

అరుణకిరణుండు తూర్పున నవతరింప
బ్రాణిలోకంబు మాంద్యమ్ముఁబాసె; నింక
నింట నుండుట మర్యాదయే కుమార!
చలిదిచిక్కంబు గట్టుము పొలముఁ జేర. 17

అప్పుడప్పుడె విచ్చి యలరు చేమంతుల
     కమ్మన్నినెత్తావి గడలుకొనఁగ,
రత్నకంబళ మట్లు రాణించు బీళులఁ
     బలువన్నెపూవులు బలిసివిరియ,
వ్రాలఁబండిన రాజనాల కేదారంబు
     పంటలక్ష్మికి నాటపట్టుగాఁగ,
ప్రొద్దునిగ్గులు సోకి పొగమంచు మబ్బులు
     బంగారు వలిపంబు పగిది వ్రేల
 
     ఈనిమేషమందు నిల యెల్ల నందమై
     స్వర్గశిల్పి యింద్రజాల శక్తి