పుట:Krxshhiivaludu (1924).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

య్యొయ్యన జిందువాఱ, సతియు న్నికటంబునలేదు, లేచి య
బ్బయ్యనునెత్తి మేను పులకాంకితమౌనటు ముద్దువెట్టుమా. 13

చలికప్పుగప్పి విచ్చలవిడి లేయెండ
     గ్రాగు ముద్దులకూఁతుఁ గౌఁగిలించి
పునికి దోఁగాడుచు బొమ్మలతో నాడు
     పసిబిడ్డమోము చుంబనముచేసి
యెగతాలి సరసాల నిల్లాలు పలుకుచు
     నవ్వినందుకు మాఱునవ్వు నవ్వి
పనివాండ్రు వచ్చియుండిన దండ్రియేమను
     నోయను శంక లోనొరసికొనఁగ
 
     జలిది కడుపారఁ గుడిచి యెద్దులను దోలి
     కొనుచు మడి కేఁగుచున్నారు, గనుమ, యొరులు
     వారు నీతోటివారలు గారె? రెడ్డి
     యువకు లెచ్చటఁ గొఱగాక యుందురయ్య? 14

మనపనిఁ జేసికొన్న నవమానమె? ప్రాఁచిపను ల్వొనర్చుచున్‌
వనిత యతిప్రయాసమున పర్వులిడం గనుఁగోవె? కావడిం
గొని సరసీజలంబులను గోపముసేయక తెచ్చియిచ్చి కాం
తను బరితోషపెట్టుము; వృథాచన వెప్పుడు నట్టిసాయముల్‌.