పుట:Krxshhiivaludu (1924).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానియందు సత్యస్ఫురణ, మనోహరత, హృదయాకర్షణాది శక్తులున్నవి. ఇదియ శిల్పముయొక్క పరమార్థము.

పాశ్చాత్యభాషలలో "పా'స్టొరల్సు" నాఁబడు పాశుపాల్యాది గ్రామాంతర వృత్తులవారి అకృత్రిమ జీవిత స్వభావాదుల వర్ణించు కావ్యము లనేకములున్నవి. అయ్యవి గ్రీకు లా'టిన్‌, భాషలలో పుట్టి ఆధునిక ఐరోపా వాఙ్మయముల యందును వ్యాపకమునకు వచ్చియున్నవి. హైందవ భాషలలో ఈతరగతికింజేరిన కావ్యములలో శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, బృందావన జీవితము, గోపగోపికాసంచారములు ఎంతయు హృదయ రంజకములు. భాగవతమునందలి దశమస్కంధమును, విశేషించి యెఱ్ఱాప్రగ్గడయొక్క హరివంశ పూర్వభాగమును దేశీయ వాక్ప్రపంచమున తమస్సునడంచి చల్లని వెన్నెలను కురిపించి చిత్తానందముచేయు చంద్రబింబములవలె నున్నవి. జయదేవకృతమైన గీతగోవిందమును నిట్టిదయ. గోపికలను వదలిన గ్రామాంతర జీవిత మలభ్యమనియో, కృష్ణకాంతలకు తదనంతరము గోపికాసంతతులు నశించిరను భ్రమగొనియో మనకవులు అట్టివర్ణనలను, ఇతర సందర్భముల, ముఖ్యాంశములుగ గైకొని వర్ణించుట మానివేసిరి. ఈనాటికి ఆవృత్తములు మరల కవితాదృష్టికి నర్హములని భావింపబడుట తటస్థమైనది. ఇట్టెప్పుడో నశియించిన మహోత్తరమైన వృత్తమును