పుట:Krxshhiivaludu (1924).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోషకమెయ్యది? తమకు గష్టముదేనట్టివైన రాజులయొక్క యుదారచర్యలా? ఆకటమాడి మలమలమాడుచు నింటికి వచ్చి వంట సిద్ధముకాకుండినను భార్యపై గోపింపక, కన్నులు మూతపడుచుండ విధిని ధ్యానించుచు నొకమూల గూర్చుండు పొలముకాపులయొక్క నడవడియా? ఆహా! జన సామాన్యము యొక్క ప్రతిదిన వృత్తములలో నెంతభావము, రసము, గుణము, నుపగతములై యున్నవో మనకవులకుం దెలియవుగదా, రాజపుత్రులను, రాజకన్యలను, చాలనందుకు బ్రాహ్మణులను వేశ్యలనుబట్టి ఝంఝాటమాడుటదప్ప కవితకు మేలైన యన్యకర్మములు లేవా?"

ఉన్నవియనుటకు ఈ "కృషీవలుడు"ను, అబ్బూరి రామకృష్ణారావు, రాయప్రోలు సుబ్బారావు మొదలైన యువకులు విరచించియుండెడు నవ్యకావ్యములును ప్రమాణములు.

ఈ గ్రంథమునందు పొలముకాపులయు కాపుటిల్లాండ్రయు దైనందిన చర్యలతోడ ఋతువర్ణనములను కవి బహుచమత్కారముగ సమన్వయించి యున్నాడు. ఇది భావగంభీరులకేగాని శుష్కపండితులకు సాధ్యమగు క్రియగాదు. ప్రాతఃకాలమునుండి రాత్రి నిద్రపోవువఱకు కృషీవలులు చేయు కార్యములొకకూర్పు; వీనితో సమ్మేళించిన విధమున చేయబడి యుండెడి ఋత్వాది ప్రకృతివర్ణన మింకొకకూర్పు. రెండును