పుట:Krxshhiivaludu (1924).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నది. ఏమీ! పూర్వికుల విధులను అతిక్రమింపవచ్చునా? వా రేర్పఱచిన కృతివిధానములుగాక అన్యము లెక్కడనైన నున్నవా? అని మూఢభక్తు లెవరైన ఆక్షేపించినయెడల "కాలమనంతము, ఇలవిశాల; భావలోకము క్రమముగా బడయు మార్పు" అని కవి వారిని తిరస్కరించి తనదారిని తా నేగెడిని. వీరు చేసియుండెడు కవితావిషయమైన చర్చను కొన్నియేడులక్రిందట సందర్భానుసారముగ నేనును "కవిత్వ తత్త్వవిచారము" లో చేసినాడను.

"ఐరోపాలోని కవీశ్వరులు కొందఱు కాపువారు, సైనికులు, మొదలైన తక్కువ వృత్తులవారి బ్రదుకులను వర్ణనార్హములని భావించి యెంతో సుందరముగ గావ్యములలో వ్రాసియున్నారు. మన గ్రంథముల మాత్రము చదివి యీ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రముయొక్క స్థితిగతుల నరయ జూచువారికి ఈ దేశమున బీదసాదలపై నాదరముగల కవి యెవడైన నున్నాడా? తుదకు బీదసాదలైన నున్నారా? యను సంశయము పట్టినను తప్పు వారిదికాదు! శోకరసము వర్ణింపవలయునన్న ననుకూలమగు సందర్భమెయ్యది? క్రొవ్వుకాఱెడి నాయికా నాయకుల యూహామాత్రములైన కష్టములా? ప్రజలు దినదినము కన్నీరుగార్చుటకైన నవకాశములేక కుడుచుచుండు పరిపరివిధములైన గోడులా? శాంత రసమునకు