పుట:Krxshhiivaludu (1924).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాను పూర్వలాక్షణికుల కరిగాపుగాడనియు స్వచ్ఛంద విహర శీలుడనియు నీక్రింది పద్యములలో బాహాటముగ చాటించి యున్నాడు.

వనలతయైన నాకవిత పత్రపుటంబుల బూవురెమ్మలన్‌
దినదిన జృంభమాణయయి తేజరిలెన్‌ సహజప్రరోహ వ
ర్ధన నియమానుసారముగ, దల్లత యెన్నడు దోటమాలిపా
ణిని గనుగోని వన్యరమణీయత జిల్కు నపూర్వపద్ధతిన్‌.

పంజరనిబద్ధకీరంబు బయలుగాంచి
యడ్డుకమ్ములదాటంగ నాసచేయు
నటు బహిర్ణియమంబుల నతకరించి
మన్మనంబు స్వాతంత్ర్యసీమకు జరించు.

కాన, యెవరేమియనుకొన్న దాన నేమి
గలుగు; గాలమనంతము; ఇలవిశాల;
భావలోకము క్రమముగా బడయుమార్పు
ఏల హృదయంబు వెలిపుచ్చ నింతయళుకు?

తన కవిత వనలత, స్వచ్ఛందవ్యాపనముగలది. చెన్నపురిలోని మాలీలదోహదములు కత్తిరింపులు మొదలగు చికిత్సలచే కృత్రిమసౌభాగ్యమువహించిన పూలచెట్లవంటిదిగాదు, "సహజ ప్రరోహవర్ధన నియమానుసారముగ" నల్లునట్టితీగె. "అపూర్వపద్ధతి" నవలంబించినది. శాస్త్రకారుల యాదేశములను, పారంపర్యప్రాప్త బహిర్ణియమంబుల పాటింపదు. ఆగమ పుంజములకుచేరిన గతానుగతికముగాదు. స్వాతంత్ర్యసీమను జరించు